Thursday, April 16, 2026
ads
Homeఎడిటోరియల్మున్సిపల్ బరిలో డాక్టర్ కాపా చంద్రకళ

మున్సిపల్ బరిలో డాక్టర్ కాపా చంద్రకళ

📰 Generate e-Paper Clip

లయన్స్ క్లబ్ లో చురుకైన పాత్ర

నవగీతం,వైరా:

డాక్టర్ కాప చంద్రకళ గత 20 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో వైరా మండలం మరియు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గైనకాలజీ విభాగంలో విశేష సేవలు అందిస్తూ ఖమ్మం జిల్లాలోని ప్రముఖ గైనకాలజీ నిపుణులు (చల్లని కాన్పుల తల్లి) గా మంచి పేరు సంపాదించారు. భర్త డాక్టర్ కాపా మురళీకృష్ణ అనెస్థిషియా వైద్యునిగా ఉంటూ సేవారంగంలో విశిష్టమైన పేరు సంపాదించారు. డాక్టర్ కాపా చంద్రకళ వైద్య వృత్తిలో ఫుల్ బిజీగా ఉంటూ కూడా సేవ రంగంలో భర్తకు పూర్తి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి గా ఉన్నారు. వైరా లయన్స్ క్లబ్ సభ్యురాలుగా ఆమె ఉన్నారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉంటూ ఉన్నత ర్యాంకులు సంపాదించి ఎంబిబిఎస్ ఎండిఓబిజి గ్రాడ్యుయేషన్ గవర్నమెంట్ కాలేజీ లో పూర్తి చేశారు. 2007వ సంవత్సరం నుండి వైరాలో ఆమె భర్త సహకారంతో మురళి కృష్ణ హాస్పిటల్ స్థాపించి కొన్నివేల తల్లుల కలలకు ఆనందానికి కారణమయ్యారు. వారు ప్రజలకు చేసిన సేవ ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో కనబడుతుంది అంటే అతిషయోక్తి కాదు.విద్యార్థులకు ఎడ్యుకేషన్ సపోర్ట్ మరియు మహిళలకు ఆర్థిక భరోసా (కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు) కొన్ని వేల మందికి కంటి చూపును ప్రసాదించడం గవర్నమెంట్ బడులల్లో మౌలిక వసతులు కల్పించడంలోనూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానన్న భరోసా కల్పించడంలోనూ వారికి పెట్టింది పేరు వీరి పాప కూడా తల్లిదండ్రుల బాటలోనే వైద్య వృత్తిని స్వీకరించి త్వరలో గైనకాలజీ ఎండి పూర్తి చేస్తున్నారు. వైరా మున్సిపల్ బరిలో నిలబడటానికి ఆమె సన్నద్ధమవుతున్నారు ఇటువంటి సేవ మూర్తి చంద్రకళకు రాజకీయ ప్రాధాన్యత కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular