Saturday, April 18, 2026
ads
Homeఎడిటోరియల్మున్సిపల్ ఎన్నికలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

మున్సిపల్ ఎన్నికలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి

తెలంగాణ రాష్ట్ర 2వ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన షెడ్యూల్ ప్రకారం తేది: 01-01-2026 రోజున వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డు యందు ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి ముసాయిదా ఓటర్ల జాబితా పై ఏమైనా అభ్యంతరాలను తెలుపుటకు గాను ఎన్నికల కమిషన్ తదుపరి షెడ్యూల్ ప్రకారం తేదీ: 05-01-2026 రోజున ఉదయం 11:00 గం” లకు మున్సిపల్ కార్యాలయంలో నమోదు కాబడిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.
ఇట్టి సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డు యొక్క డిలిమిటేషన్ బౌండరీ ప్రకారం ఓటర్లను సంబంధిత వార్డులోనే చేర్చగలరని కమిషనర్ ని కోరినారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రచురించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో ఇంకా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అట్టి అభ్యంతరాలను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించగలరని తెలిపినారు. అలాగే తేదీ: 10-01-2026 రోజున తుది ఓటర్ల జాబితా ప్రచురించబడునని తెలిపినారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular