నవగీతం,మల్లాపూర్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మోగిలిపెట్ గ్రామంలో ఇటీవల జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు శుక్రవారం గ్రామ సర్పంచ్ కళా రమేష్ , ఉప సర్పంచ్ దండవేని రాజేందర్ గ్రామపంచాయతీ పాలకవర్గం వార్డు సభ్యులు అందరూ కలిసి వారి ఇండ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు మరణ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భవిష్యత్తులో ప్రభుత్వపరంగా ఏ అవసరమున్న పాలకవర్గం అండగా ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని బాధ్యతతో కూడిన భరోసా కల్పిస్తామని అన్నారు.

