Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమల్లాపూర్ సర్పంచ్ లక్ష్మణ్‌ కు ఘన సన్మానం

మల్లాపూర్ సర్పంచ్ లక్ష్మణ్‌ కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్‌ను ప్రముఖ జర్నలిస్ట్, తెలంగాణ మీడియా అకాడమీ ఏఐ జర్నలిజం శిక్షణ తరగతుల బోధకుడు ముద్దం నరసింహ స్వామి శాలువాతొ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నరసింహ స్వామి మాట్లాడుతూ.. మల్లాపూర్‌ ను జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆయన సర్పంచ్‌కు సూచించారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఎదులాపురం శంకర్, వ్యాపారవేత్త రుద్ర లక్ష్మిరాజం, సిరిపురం రాజు కుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular