Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసెల్ పాయింట్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాల్క రాకేష్

సెల్ పాయింట్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాల్క రాకేష్

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి:

మెట్ పల్లి పట్టణ కేంద్రంలో సెల్ పాయింట్ అసోసియేషన్ కార్యవర్గాన్ని సభ్యుల సమక్షంలో సమావేశం నిర్వహించి బుధవారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఏకంగా ఐదవ సారి ఏకగ్రీవంగా బాల్క రాకేష్ ని అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సెల్ పాయింట్ సంఘ అభివృద్ధికి సెల్ పాయింట్ యజమానుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని నాపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు రుణపడి ఉంటానని అన్నారు. గౌరవ అధ్యక్షులుగా సంకు ఆనంద్ , ఉపాధ్యక్షులుగా మహమ్మద్ వసీం కటకం జగదీష్. కార్యదర్శిగా గంగాధర్, సహాయ కార్యదర్శి అజీమ్, కోశాధికారిగా కోటగిరి సంతోష్. యూనియన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular