Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఎడారి చెమట చుక్కలకు విలువ ఇవ్వండి

ఎడారి చెమట చుక్కలకు విలువ ఇవ్వండి

📰 Generate e-Paper Clip

రూ.”1000″ కోట్లతో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయండి

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

గల్ఫ్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక బడ్జెట్ అవసరమని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ దుబాయ్ నుండి ఫోన్లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు 150 కోట్లు,సంవత్సరానికి 18 వందల కోట్ల ఆదాయం గల్ఫ్ కార్మికులు ఇస్తున్నారు అని అన్నారు. కానీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి,రాష్ట్ర బడ్జెట్ లో ఒక వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడానికి ప్రభుత్వ పెద్దలకు మనసు రావడం లేదా అని రాజాగౌడ్ ప్రశ్నించిండు. గల్ఫ్ నుంచి తెలంగాణకు భారీగా విదేశీ మారకం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నది.గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో కేటాయింపులు ఎందుకు ఇవ్వాలి..? అనేవారికి సూటి ప్రశ్న ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు ఒక్కొక్కరు రూ.20 వేల చొప్పున ప్రతినెలా 3 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్నారు.ఈ విధంగా ఏడాదికి 36 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి చేరుతున్నాయి.ఈ డబ్బు వినియోగంలోకి వచ్చి కనీసం 5 శాతం స్థానిక పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు రూ.150 కోట్లు, సంవత్సరానికి రూ.18 వందల కోట్ల  ఆదాయం సమాకూరుతుంది. గల్ఫ్ కార్మికులు తెలంగాణకు నెలకు రూ.3,000 కోట్లు ఏడాదికి రూ.36,000 కోట్లు విదేశీ మారకం పంపిస్తున్నారు.ఈ డబ్బు వినియోగంతో కనీసం 5 శాతం పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు రూ.150 కోట్లు సంవత్సరానికి రూ.1,800 కోట్ల ఆదాయం వస్తోంది.ఇంత భారీగా ఆదాయం ఇస్తున్న 15 లక్షల మంది గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ1,000 కోట్లు కేటాయించాలంటే ప్రభుత్వ పెద్దలకు ఇంకా మనసు రావడం లేదు ఇది దయ కాదు మా హక్కు అని రాజాగౌడ్ అన్నారు. కావున వెయ్యికోట్లతో ఎన్ఆర్ఐ పాలసీతో కూడిన గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేసి గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేసియా అందించాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular