Saturday, April 18, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం

పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఆదివారం మల్లాపూర్ ఎం.పీ.డీ.ఓ జగదీశ్ ఆధ్వర్యంలో మల్లాపూర్ మేజర్ పంచాయతీ కార్యాలయం లో పారిశుధ్య కార్మికులకు మాస్కులు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం, సన్మానించడం వారి కష్టాన్ని గుర్తించి, గౌరవించడం సామాజిక బాధ్యత అని, గ్రామస్థులందరి ఆరోగ్యాన్ని రక్షించే వారి ఆరోగ్యం కోసం వైద్య పరీక్షలు కూడా చేయిస్తున్నామని,పారిశుధ్య కార్మికులను సామాజిక వైద్యులు గా కొనియాడుతూ..వారి సేవలు వెలకట్టలేనివని వారి శ్రమను గుర్తించి ఇలాంటి సన్మాన కార్యక్రమాల ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపడం చాలా అవసరం అని అన్నారు.

ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, పారిశుధ్య కార్మికులు చంద్రయ్య గంగాశం లక్ష్మి రాజం వార్డు సభ్యులు ముత్యాల గంగారాజం,కొంపెల్లి రాకేష్, ముష్కరి రమేష్, ఎనుగంటి నరేష్, ఎం.డీ షబ్బీర్, అరికుప్పల రాజం, కదుర్క లక్ష్మి ,అల్లె లత చంద్రయ్య, శనిగారపు లావణ్య నరేష్, కాషవత్తుల లక్ష్మి, ఏనుగు లక్ష్మి, జ్ఞానేశ్వరి, ఆశా కార్యకర్తలు రమ, లీలా రాణి, ఏవీఆర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular