నవగీతం, మెట్ పల్లి:
మెట్‌పల్లి పట్టణంలోని విదిత్ రెడ్డి గార్డెన్స్‌లో కోరుట్ల నియోజకవర్గ పటేల్స్ యూత్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి విజయ్ ఆజాద్, డాక్టర్ జెఎన్ వెంకట్, పిల్లల వైద్య నిపుణులు జె. గంగాసాగర్, జిల్లా అధ్యక్షుడు వడ్నాల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొమిరెడ్డి విజయ్ ఆజాద్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సమాజ ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గంగాసాగర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉపసర్పంచులు, కౌన్సిలర్లు, చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి, వార్డుల అభివృద్ధితో పాటు గ్రామాలలోకి కొత్తగా వచ్చే వ్యక్తులపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే యువత గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తగు చర్యలు తీసుకుని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జె.ఎన్. వెంకట్, డాక్టర్ పుప్పాల సాగర్ పటేల్, డాక్టర్ సంధ్యారాణి పటేల్, మెట్‌పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, కౌన్సిలర్లు మాసుల ప్రవీణ్, నునుగొండ నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, చెదలు సత్యనారాయణ, మార్గం నరేష్, ఒజ్జెల శ్రీనివాస్, పుప్పాల నాగేష్, నోముల రమేష్, ఎశమేని గణేష్, జెట్టి రూపేష్ తదితరులు పాల్గొన్నారు.


