నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండల కేంద్రం లో అంగన్వాడీ కేంద్రం -1లో చిన్నారుల సమగ్ర వికాసం కోసం “అక్షరాభ్యాసం” (3-6 ఏళ్లు) మరియు “అన్నప్రాసన” (6 నెలలు) కార్యక్రమాలు గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశం చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం మరియు సరైన పోషకాహారాన్ని అందించడం అని అన్నారు.ఈ కార్యక్రమం లో కేంద్రం నిర్వాహకురాలు ఎం. రాధ, ఉప సర్పంచ్ సోమ రెడ్డి, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్,ముష్కరి రమేష్,కదుర్కలక్ష్మి-రాజేందర్,అల్లె లత,అరికుప్పల రాజం,శనిగారపు నరేష్,ఎం.డి షబ్బీర్,ఎనుగంటి నరేష్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


