నవగీతం,వేల్పూర్ ప్రతినిధి:
వేల్పూర్ గ్రామానికి చెందిన ఆకుల సుశాంత్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగలేక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడని తెలుసుకున్న ఎన్నారై మాల్టా వేల్పూర్ ఫౌండేషన్ యువకులు ముందుకు వచ్చి రూ.65000/-( అరవైఐదు వేల రూపాయలు)ఆర్థిక సహాయం సుశాంత్ కుటుంబ సభ్యులకు అందజేశారు. సుశాంత్ ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఇదే యూనిటీ తో గ్రామం లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్న వారికీ సహాయం చేస్తూ ఉంటామని ఫౌండేషన్ యువకులు తెలిపారు.మాల్టా ఫౌండేషన్ యువకులను సర్పంచ్ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు అభినందించారు.

