Wednesday, April 22, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఈత సరదా విషాదంగా మారకూడదు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఈత సరదా విషాదంగా మారకూడదు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

📰 Generate e-Paper Clip

మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దు – చిన్న నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీయవచ్చు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు, యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు ,కాలువల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ఇట్టి క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండటం వలన అందరూ ఇట్టి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదంగా మారకూడదు అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈతను నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యoగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లయితే పిల్లల ప్రాణానికి ప్రమాదమని ఇట్టి విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలను యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.

మైనర్ లకు వాహనాలు ఇవ్వకండి

జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక శ్రద్ధ ఉంచడం జరిగినదని తల్లిదండ్రుల, మైనర్లకు వాహనం ఇవ్వకూడదని, వాహనం ఇచ్చినచో వారు తెలిసి తెలియని డ్రైవింగ్ తో వాహనం నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, దానితో వారికి మరియు ఎదుటి వ్యక్తులకు ప్రమాదం జరగటం వల్ల రెండు కుటుంబాలు నష్ట పోతున్నాయని కావున మైనర్ లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ మైనర్ కు వాహనం ఇచ్చి ఏదైనా ప్రమాదం జరిగిన లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తూ వాహనం తో పట్టుబడిన వాహన యజమాని పై కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular