Monday, April 20, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలకళ్లెం రెడ్డి పల్లెను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తా..‌‌

కళ్లెం రెడ్డి పల్లెను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తా..‌‌

📰 Generate e-Paper Clip

కళ్లెం రెడ్డి పల్లెలో పర్యటించిన మంత్రి అడ్లూరి

నవగీతం, ధర్మారం:

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలకులు కళ్లెం రెడ్డిపల్లి వైపు కన్నెత్తి చూడలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేట పంచాయతీ పరిధిలోని కళ్లెం రెడ్డి పల్లెలోని సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం కల్లెం రెడ్డిపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్తులు మంత్రి లక్ష్మణ్ కుమార్ దృష్టి తీసుకువెళ్లారు. సమస్యలపై స్పందించిన మంత్రి గ్రామంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.గ్రామంలోని కరెంట్ సమస్యను పెద్దపల్లి, కరీంనగర్ రెండు జిల్లాల విద్యుత్ అధికారులు కలిసి పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామంలో కొత్త రేషన్ రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మూడు పంచాయతీల పరిధిలో ఉన్న కళ్ళెం రెడ్డి పల్లి ని ఒకే గ్రామ పంచాయతీగా చేసి స్వయం పాలన చేసుకునే విధంగా కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు గత ప్రభుత్వంలో కల్లం రెడ్డి పల్లెను ఎవరు పట్టించుకోలేదని రానున్న రేవంత్ రెడ్డి నాయకత్వం లో ని ప్రజాపాలనలో కళ్లెం రెడ్డి పల్లి సమస్యలను పరిష్కరించి గ్రామస్తులకు సంక్షేమ పథకాలు అందజేస్తామని మంత్రి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular