ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం..
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ పదవి ప్రమాణ స్వీకారం, అభినందన సభ జగిత్యాల జిల్లా కేంద్రంలో ని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమానికి మంత్రి అడ్లూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ గెలిచిన, ఓడిన ప్రజల మధ్యనే ఉంటూ ముందుకు సాగానని అన్నారు. అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓటమి చెందిన అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ముందుకు సాగినట్లు మంత్రి తెలిపారు. పార్టీలో కమిట్మెంట్ గా పని చేశాను కనుక నేడు క్యాబినెట్ లో పని చేసే అవకాశం దక్కిందని మంత్రి అడ్లూరి అన్నారు.బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తనకు అనేక ఆఫర్లు ఇచ్చిందని అయినప్పటికీ ఏలాంటి ఆఫర్లను లొంగకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని మంత్రి అడ్లూరి అన్నారు.

జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని ఎవరు నిరాశ పడవద్దని మంత్రి అన్నారు. రాష్ట్రంలో రేవంత్ పాలన పోవాలి.. మార్పు రావాలి అని జీవన్ రెడ్డి నినాదం ఎత్తుకున్నారని ఎందుకు మార్పు రావాలి అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నందుకు మార్పు రావాలా.. ? అర్హులకు రేషన్ కార్డు లు అందించినందుకు మార్పు రావాలా..? నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు మార్పు రావాలా.. ? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు మార్పు రావాలా ..? అని జీవన్ రెడ్డిని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని రానున్న రోజుల్లో నిత్యం ప్రజల మధ్య ఉంటూ రాష్ట్రంలో మరో మారు అధికారంలోకి వస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2029లో సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. కొత్తగా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, దుద్దిళ్ల శ్రీను బాబుతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.


