Tuesday, April 28, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకొడిమ్యాలలో హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ

కొడిమ్యాలలో హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

కొడిమ్యాల మండల కేంద్రంలో మే 3వ తేదీ ఆదివారం స్థానిక అంగడి బజార్ వద్ద నిర్వహించనున్న హిందూ సమ్మేళనం సందర్భంగా ఆహ్వాన కరపత్రాన్ని ఘనంగా ఆవిష్కరించారు. సమ్మేళన కమిటీ అధ్యక్షుడు రాచకొండ చందు, కార్యదర్శి అయిట్ల రమేష్ కలిసి కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ఉప మండల ప్రముఖ్ మంచాల శ్రీనివాస్, వడ్లకొండ హనుమండ్లు, అల్వాల హనుమండ్లు, ఎర్రోజు శ్రీధర్, దౌపతి సత్యం, చిలువేరు శ్రీనివాస్, మొగిలిపాలెం శ్రీనివాస్, బల్కం అనిల్ పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాచకొండ చందు మాట్లాడుతూ “గడపలోపే కులం – గడపదాటితే హిందువులం మనం అందరం” అని పేర్కొన్నారు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమ్మేళనానికి ప్రధాన వక్తగా జిల్లా కార్యవాహ గోల్కొండ నాగరాజు హాజరై అనుగ్రహ భాషణం చేయనున్నారు. ప్రతి హిందువు కుటుంబంతో కలిసి వచ్చి ఐక్యతను చాటుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, హిందూ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular