నవగీతం,మంచిర్యాల:
బిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి, జిఎస్ ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు, సిరి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ పుట్టినరోజు సందర్భంగా మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జి ఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు, సిరి ఫౌండేషన్ సభ్యులు, రాజా రమేష్ అభిమానులు తలసేమియా బాధితులకు రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాజా రమేష్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా జి ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిరి, జి ఎస్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు, రాజా రమేష్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు

