నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో హిందూ సమ్మేళన సమితి కరపత్రికను ఆవిష్కరించినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మం అనగా పరమ అద్భుత జీవన విధానం ఈ జీవన విధానముకు ఆయువుపట్టు మన ఆచారాలు ఆలయాలు సంస్కృతి వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ప్రస్తుత సమాజం లో మన సనాతన హిందూ ధర్మ వైభవాన్ని చాటి చెప్పడానికి హిందూ సమాజంలో ఐక్యత పెంపొందించడానికి ధర్మ సంరక్షణ దిశగా అడుగులు వేయడానికి హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ పవిత్ర కార్యక్రమంలో సాధుసంతులు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని మనకు దిశా నిర్దేశం చేస్తారని కావున హిందూ బంధువులందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకరమ్మ ఆశాలు ఉప సర్పంచ్ ప్రణయ్ నార వేణి జనార్ధన్ విష్ణువర్ధన్ రాజు దువ్వ నవీన్ కొండ గణేష్ నాగ శ్రీనివాస్ అందే సత్యం అంజిరెడ్డి శేఖర్ లింగారెడ్డి అంజి రాజ్ లక్ష్మీనారాయణ శ్రీనివాస్ రాము సుదర్శన్ అశోక్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


