ఏకీన్‌పూర్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ అంజిరెడ్డి
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
రైతులు తాము పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలుకేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులుజువ్వాడి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని 6వ వార్డు ఏకీన్‌పూర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. రైతులసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందనితెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్మినష్టపోవద్దని సూచించారు. మద్దతు ధరతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న ఇతర ప్రయోజనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటిఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, నాణ్యతా ప్రమాణాలు పాటించిధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్ రెడ్డి, పాక్స్ సీఈఓ మొహమ్మద్ తాజాద్దీన్ బాబా పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభంపట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాక్స్ సిబ్బంది, పలువురుకాంగ్రెస్ నాయకులు, స్థానిక రైతులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


