నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి:
42 సంవత్సరాలు అజ్ఞాతంలో గడిపి తన స్వగృహానికి చేరుకున్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ కార్యదర్శి కోరుట్ల పట్టణానికి చెందిన తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవోజిని, ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్, బీసీ సెల్ మండల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూస రాజేశ్వర్, డబ్బా గ్రామాభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానశంకర్ లు కోరుట్ల పట్టణానికి వెళ్లి దేవోజీని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన బాగోగులు తెలుసుకున్నారు. అజ్ఞాతంలో గడిపిన దినాలను తెలుసుకున్నారు. వారితోపాటు పలువురు నాయకులు ఉన్నారు

