Thursday, April 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలనీటితొట్టిని అందుబాటులోకి తీసుకు వచ్చిన పాలకవర్గం

నీటితొట్టిని అందుబాటులోకి తీసుకు వచ్చిన పాలకవర్గం

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రంలో పశు వైద్య కేంద్రం పక్కన గత రెండు సంవత్సరాల నుండి నిరూపయోగంగా ఉన్నటువంటి బోరుబావి  మోటార్ ని గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో రిపేర్ చేయించి నీటితొట్టిని ఉపయోగం లోకి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్షణ్ మాట్లాడుతూ వేసవి కాలం వచ్చింది కావున నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నామని, నీటిని పొదుపు గా వాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోమ రెడ్డి, వార్డు సభ్యులు ముష్కరి రమేష్,లావణ్య – నరేష్,అల్లె లత -చంద్రయ్య, మహమ్మద్ షబ్బీర్,సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular