నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:
మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మైసమ్మ పండుగ మైసమ్మ పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలు, అత్యంత ఉత్సాహపూరిత వాతావరణం మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ మైలారం లింబాద్రి మరియు జువ్వాడి నర్సింగరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.డప్పు చప్పుళ్లు, సాంస్కృతిక కోలాహలంతో మున్సిపల్ కార్యాలయ పరిసరాలన్నీ పండుగ శోభను సంతరించుకోగా, ఆఫీస్ సిబ్బంది మరియు కార్మికులు కులమతాలకు అతీతంగా ఏకతాటిపై నిలిచి ఈ వేడుకను జరుపుకోవడం విశేషం. నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమయ్యే కార్మికులందరూ ఒకే కుటుంబంగా కలిసి అమ్మవారి కృపాకటాక్షాల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామూహిక ప్రసాద వితరణ అనంతరం జువ్వాడి నర్సింగరావు, చైర్మన్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఇలాంటి ఐక్యతా వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని కొనియాడారు.


