Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధం

మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధం

📰 Generate e-Paper Clip

హోటల్స్,దుకాణదారులు సహకరించాలని విజ్ఞప్తి

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మేజర్ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అన్ని కిరాణా షాపులు ఇతర దుకాణదారుల దగ్గరకు వెళ్లి ప్లాస్టిక్ నిషేధం గురించి వివరిస్తూ ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగి నష్టాలు తెలుపుతూ షాప్ యజమానులు హోటల్ నిర్వాహకులు ప్రతి ఒక్కరు పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించి గ్రామపంచాయతీ కి సహకరించాలని కోరారు.ఈ సందర్బంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలలో అవగాహన పెంచడం ద్వారా ప్లాస్టిక్ రహిత గ్రామాలను రూపొందించవచ్చని బాధ్యతగా వ్యవహరించాలి అని అన్నారు.ప్లాస్టిక్ కవర్లకు బదులుగా కాగితం, జూట్, బట్ట సంచులను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఉప సర్పంచ్ సోమ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు ముష్కరి రమేష్,భూక్యా శేఖర్, అల్లె చంద్రయ్య,కదుర్కా రాజేందర్, కాషవత్తుల గంగా రెడ్డి అరికుప్పల రాజం, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular