Monday, April 27, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలరాష్ట్ర చరిత్రలో తొలి సారి రైతును రాజు చేసే ప్రయత్నంలో సపలమైన ప్రజా ప్రభుత్వం..

రాష్ట్ర చరిత్రలో తొలి సారి రైతును రాజు చేసే ప్రయత్నంలో సపలమైన ప్రజా ప్రభుత్వం..

📰 Generate e-Paper Clip

మామిడి రాజశేఖరరెడ్డి రైతు ఉద్యమ నాయకులు

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం చెయ్యని విదంగా రైతును రాజు చేసే గొప్ప ప్రయత్నం రైతుల పక్షపాతి గా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వనికి రైతు గా సలాం చేస్తున్నాఅని రైతు ఉద్యమ నాయకులు మామిడి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్న విషయం గుర్తు ఉంచుకోవాలి మక్కాల కొనుగోలు కేంద్రంల కోసం ధర్నా చేస్తే రైతుల పై నాన్ బెయిల్ కింద కేసులు పెట్టినది మర్చిపోలేదు. రైతులు గత ప్రభుత్వాలు సంకెళ్లు వేసి రైతులను కోర్ట్ ముందు హాజరు పరిచిన సంఘటన యాదిలో ఉంచుకున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక రైతును రాజు చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి రైతుగా మరియు రైతు ఉద్యమ నాయకునిగా నా సలాం ఒకే సారి అటు మక్కల కొనుగోలు వడ్ల కొనుగోలు,మరియు సన్న వడ్లకు బోనస్ ఇలాంటి మంచి పనులకు రైతుగా హర్షం వ్యక్తం చేస్తున్న ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఇలానే ఎప్పుడు ఇదే ధోరణితో ఉంటే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు అనేవి ఉండవు రైతు రాజుగా మారె సమయం ఆసన్నమైందని అనిపిస్తుంది ఎప్పుడు ఇలానే ప్రజా ప్రభుత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular