నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జగిత్యాల సీనియర్ సివిల్ జడ్జి కం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి. డి. నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు. అనంతరం శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదాన్ని సమర్పించారు.వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో, మంగళవారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసిపోయి భక్తి పారవశ్యాన్ని తలపించింది.ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ తూము శ్రీనివాస్, సత్యం తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

