నవగీతం , కోరుట్ల ప్రతినిధి :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని టౌన్, మండల కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గజెంగి నందయ్యతో ఆధ్వర్యంలో కోరుట్ల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తిరుమల గంగాధర్‌ను, అలాగే కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పన్నాల అంజయ్యను తక్షణమే అమల్లోకి వచ్చేలా నియమించారు. క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడానికి నూతనంగా ఎన్నికైన ఈ నాయకులు శాయశక్తులా కృషి చేస్తారని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారని టీపీసీసీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేయగా… తమపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవులను అప్పగించినందుకు నూతన అధ్యక్షులు తిరుమల గంగాధర్, పన్నాల అంజయ్య పార్టీ అగ్రనాయకత్వానికి, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలపడంతో పాటు ప్రత్యేకంగా కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావుకు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావుకు తమ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

