Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలజిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్..

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్..

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా దూమల రాజ్ కుమార్ ను నియమిస్తూ శుక్రవారం గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య వారికి నియామక పత్రం అందచేశారు. అనంతరం దూమల రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ నియామకానికి సహకరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య లకు తనకు బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ముఖ్యంగా ఎస్సీ వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.అనేక పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.ఈ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular