Saturday, May 30, 2026
ads
Homeఖమ్మంతెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య సభను విజయవంతం చేయండి

తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య సభను విజయవంతం చేయండి

📰 Generate e-Paper Clip

నవగీతం: వైరా ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య ఖమ్మం జిల్లా 22వ మహాసభలను జయప్రదం చేయాలని మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పోటు కళావతి, కార్యదర్శి ఏపూరి లతా దేవి అన్నారు, మంగళవారం వైరాలో ఆహ్వాన పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 16న వైరాలో కమ్మవారి కళ్యాణమండపం నందు జరిగే తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య 22వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ,ఈ సభ విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలిరావాలని వారు అన్నారు. ముఖ్యఅతిథిగా నేదునూరి జ్యోతి తో పాటు పలువురు మహిళా నాయకురాలు పాల్గొనున్నారు అన్నారు. 8 దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో మహిళల పట్ల నేటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది అని మహిళల హక్కుల ఉల్లంఘన సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూనే ఉన్నారని సమాన పనికి సమాన వేతనం అనేది కేవలం కాగితాలకే పరిమితం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దొండపాటి రమేష్ యామాల గోపాలరావు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular