నవగీతం, కోరుట్ల ప్రతినిధి:
పవిత్రమైన బక్రీద్ పండుగను పురస్కరించుకుని, కోరుట్ల పట్టణ స్థానిక ఈద్గా వద్ద బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ అంటూ ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి, భక్తికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను అందరూ భక్తిశ్రద్ధలతో, శాంతి సౌభ్రాతృత్వాలతో జరుపుకోవాలని, ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని వారు ఆకాంక్షించారు. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ లు పొట్ట సురేందర్, కిరణ్, మోసిను, మాజీ కౌన్సిలర్ పేర్ల సత్యం నాయకులు వెంకటేష్, నీలి శ్రీనివాస్,అతీక్, గంగాధర్, విజయ్, తదితరులు ఉన్నారు.

