Sunday, May 10, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపదవ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం

పదవ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:

మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో  అభినందన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 500కు పైగా మార్కులు సాధించిన 18 మంది విద్యార్థులను గ్రామ  సర్పంచ్ గూడూరు తిరుపతి వార్డు సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ ఏడాది పాఠశాల నుండి పరీక్షలకు హాజరైన 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, వారిలో 18 మంది 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. అలాగే ఒక విద్యార్థి 563 మార్కులతో మండల స్థాయిలో రెండవ స్థానం పొందడం గ్రామానికి గర్వకారణమని సర్పంచ్ గూడూరు తిరుపతి పేర్కొన్నారు.విద్యార్థుల విజయానికి కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు ఉన్నత స్థానాలు సాధించి గ్రామానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ రాజశేఖరరెడ్డి, కార్యనిర్వాహణాధికారి నారాయణ, గ్రామ పాలనాధికారి నాగరాణి, రాజేశం, వార్డు సభ్యులు హరీష్, రాజారెడ్డి, రాజు, భూమేష్, ఉపాధ్యాయులు రవీందర్, జగదీశ్వర్, కొమురయ్య, కవిత, సరస్వతి, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular