Sunday, May 10, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలబుగ్గారం మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం...

బుగ్గారం మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం…

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల/ బుగ్గారం:

బుగ్గారం మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో మంజూరైన ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఐదేళ్ల పదవీకాలంలో మండల కేంద్రంలోని అన్ని కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular