Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపలు రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్

పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్

📰 Generate e-Paper Clip

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి:

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉదేశ్యంతో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం మల్లాపూర్ మండలం రాఘవపేట, ముత్యంపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలాగే మొగిలి పేట గ్రామంలోని ఏ ఆర్ ఎస్ రైస్ మిల్, ముత్యం పేట, రాఘవ పేట గ్రామం లోని పూజ ఇండస్ట్రీయల్ రైస్ మిల్లు, విష్ణు ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో మరియు జిల్లాలో అకాల వర్షాలు ఉన్నందున వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు గన్ని సంచులు, టార్ఫలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకొని పాడీని ప్రొటెక్ట్ చేయాలని అన్నారు.కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు వస్తున్న వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా అన్‌లోడ్ చేసిన వెంటనే లారీలను త్వరితగతిన పంపించాలని మిల్లర్లను ఆదేశించారు. రైతులు మరియు రవాణాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం దిగుమతి, నిల్వ, మిల్లింగ్ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.మిల్లుల్లో ధాన్యం నిల్వలు, తేమ శాతం, మిల్లింగ్ సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మిల్లర్లు హమాలీలను అందుబాటులో ఉంచుకొని వచ్చిన ధాన్యాన్ని దింపుకోవాలని అలాగే మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు, అధికారులు సమన్వయం చేసుకొని కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ పరిశీలనలో ఆర్డీవో నరసింహ రావు, సివిల్ సప్లైస్ డిఎం జితేంద్ర ప్రసాద్ ,తహసీల్దార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular