రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్..
నవగీతం, జగిత్యాల/ఎండపల్లి:
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కొత్త పాత తేడా లేకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన గెల్లు చంద్రశేఖర్ ఎండపల్లి మండలం రాజారాం పల్లి గ్రామంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు మండలంలోని అన్ని గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకోని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం సూచనలు పాటిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మండలంలో పార్టీ బలోపేతానికి పనిచేయాలని మంత్రి సూచించారు. గతంలో పనిచేసిన నాయకులతో పాటు కార్యకర్తలను విస్మరించకుండా పార్టీ నియమాలను లోబడి పనిచేస్తు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చాలని మంత్రి సూచించారు.


