నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల పట్టణానికి చెందిన పసుల రాంప్రసాద్ కుమారుడు అనారోగ్యంతో మృతి చెందగా శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు పరామర్శించారు. కోరుట్ల పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.ఆయన వెంట నాయకులు అజార్ భాయ్, చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, తిప్పిరి గంగాధర్, పసుల శివకుమార్, కోరుట్ల రాజ్ కుమార్, సోమిడి ప్రశాంత్ తదితరులున్నారు.

