Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలవిద్యను కొనసాగించటానికి మెట్ పల్లి డిగ్రీ కళాశాలలోనే చేరండి : ప్రిన్సిపాల్

విద్యను కొనసాగించటానికి మెట్ పల్లి డిగ్రీ కళాశాలలోనే చేరండి : ప్రిన్సిపాల్

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

ఇంటర్మీడియట్ తో పాటు తత్సమాన అర్హత గల విద్యార్థులు తమ విద్యను నిరాటంకంగా కొనసాగించటానికి మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చేరాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గురువారం రోజున “దోస్త్” అడ్మిషన్ల కోసం ప్రిన్సిపాల్ అధ్వర్యంలో ప్రచార కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్, వొకేషనల్ కోర్సులు,”ఓపెన్ ఇంటర్” తో పాటు మధ్యలో విద్యను ఆపేసిన (డ్రాప్అవుట్) విద్యార్థులందరూ విధిగా తమ విద్యను కొనసాగించటానికి మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చేరాలని హితవు పలికారు. కళాశాలలో బీ. ఏ ; బీ.కాం (కంప్యూటర్స్) కోర్సులు ఉన్నాయని, ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ కోర్సులు ఎంత దోహదపడతాయన్నారు.సివిల్ సర్వీస్ లతో పాటు గ్రూప్ వన్, గ్రూప్ టూ,గ్రూప్ త్రీ,గ్రూప్ ఫోర్ తదితర ఉద్యోగాల కోసం డిగ్రీ ఉత్తీర్ణత అవసరమని స్పష్టం చేశారు.పిల్లలున్న తల్లులు మాత్రం మా కళాశాలలో అడ్మిషన్ లు తీసుకొని, ఉత్తీర్ణులవుతున్నారని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య సగర్వంగా ప్రకటించారు.కళాశాల వైస్ ప్రిన్సిపల్ తొంటి దేవన్న మాట్లాడుతూ, కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని,విద్యార్థుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యమని అన్నారు. కళాశాల అకాడమీ కో-ఆర్డినేటర్ బిల్ల రాజేందర్ మాట్లాడుతూ, కళాశాల వెంకటరావుపేటలో ఉందని, విద్యార్థులకు బస్సు సౌకర్యం ఉందని గుర్తు చేశారు.మల్లాపూర్ మండలంలోని హుస్సేన్ నగర్ లో కామర్స్ హెచ్.ఓ.డి. ఏ.మనోజ్ కుమార్ మరియు కామర్స్ లెక్చరర్ అంజయ్యలు అడ్మిషన్ ల కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ ఈ.ఓ రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ నర్సయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular