నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి గ్రామంలో ఉన్న శివాలయం శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని శివాలయానికి గతంలో కాంపౌండ్ సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులంతా కలిసి విరాళాలు సేకరించి కాంపౌండ్ గేటును నిర్మించారు.ఆ నిర్మాణానికి గుర్తుగా ఆలయ ప్రాంగణంలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గుర్తుతెలియని వ్యక్తులు ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనపై స్పందించిన స్థలం దాత నేరెళ్ల చిన్న బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో గ్రామంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


