Saturday, May 2, 2026
ads
Homeతెలంగాణజగిత్యాల27వ వార్డులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

27వ వార్డులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

నవగీతం,కోరుట్ల ప్రతినిధి :

​కోరుట్ల పట్టణంలోని 27వ వార్డుకు చెందిన ఉషకోల రాధ, గజ్జెల్లి సరితలకు మంజూరైన “కళ్యాణ లక్ష్మి” చెక్కులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి 27వ వార్డు కౌన్సిలర్ ఇందూరి తిరుమల వాసు శనివారం పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular