ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజుకు ఘన సన్మానం
నవగీతం,కోరుట్ల :
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ప్రాథమిక పాఠశాల ఎస్‌ఆర్‌ఎస్‌పీ క్యాంప్ (గడి కల్లూరు రోడ్) ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజును మండల విద్యాధికారి గంగుల నరేశం ఘనంగా సన్మానించారు.ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తూ 161 మంది నూతన విద్యార్థులను చేర్పించి, పాఠశాల విద్యార్థుల సంఖ్యను 365కు పెంచడం పట్ల మండల విద్యాధికారి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఇది గర్వకారణమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఎస్. జోష్ణ,మార్గం రాజేంద్ర ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్, టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రణధీర్, నరసింహమూర్తి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీలు పాల్గొని నునావత్ రాజును అభినందించారు.ఈ సందర్భంగా నునావత్ రాజు మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి సహకరించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా నాణ్యమైన విద్య అందిస్తూ ప్రభుత్వ పాఠశాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

