Thursday, May 7, 2026
ads
Homeతెలంగాణకరీంనగర్నగల దుకాణంలో గాయపడిన వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి

నగల దుకాణంలో గాయపడిన వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి

📰 Generate e-Paper Clip

నవగీతం, కరీంనగర్:

కరీంనగర్ నడిబొడ్డులో ఉన్న బంగారం షాప్ లో నిన్న జరిగిన దొంగల బీభత్సం అధికారుల మరియు ప్రభుత్వ వైఫల్యం అని జనసేన పార్టీ నాయకులు కాస రాజు అన్నారు  సంఘటన జరిగి 24 గంటలు అవుతున్నా కూడా ఇప్పటికీ నిందితులను పట్టుకోకపోవడం ఈ ప్రభుత్వ విఫలమని అన్నారు. కేంద్రమంత్రి కార్యాలయం ఉన్నటువంటి అతి సమీపంలో ఈ సంఘటన జరగడం రాబోయే రోజుల్లో సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని అన్నారు ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. తక్షణమే గాయపడినటువంటి ఉద్యోగులు ఇద్దరికీ కూడా 10 లక్షలు ఎక్స్గ్రేషియా విడుదల చేయాలని జనసేన పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular