Sunday, September 20, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలప్లాస్టిక్  వాడకం పై వార సంతలో అవగాహన

ప్లాస్టిక్  వాడకం పై వార సంతలో అవగాహన

📰 Generate e-Paper Clip

దుకాణదారులు సహకరించాలని విజ్ఞప్తి

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే వారసంత లో కూరగాయలు అమ్మే వారికి గ్రామపంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ సమస్య. ప్లాస్టిక్ వాడకం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, దాని వల్ల కలిగే నష్టాలు చాలా ఎక్కువ, భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది. ఇది నేల, నీరు, గాలిని కలుషితం చేస్తుంది,ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్ల పశువులు, పక్షులు, సముద్ర జీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమం లో కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, మొరపు గంగా రాజం, కొంపెల్లి రాకేష్,షబ్బీర్, ముత్యాల గంగారాజం, ఎనుగంటి నరేష్,శనిగారపు నరేష్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular