Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణనిజామాబాద్యువకుల ఐక్యతకు క్రీడలు ఎంతో ఉపయోగం: సర్పంచ్ నవీన్

యువకుల ఐక్యతకు క్రీడలు ఎంతో ఉపయోగం: సర్పంచ్ నవీన్

📰 Generate e-Paper Clip

గంగారాం స్మారక  క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

నవగీతం, వేల్పూర్ ప్రతినిధి:

వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామ సర్పంచ్ బేల్దారి నవీన్ అధ్వర్యంలో వారి తాత జ్ఞాపకార్థం బేల్దారి గంగారం స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ బేల్దారి నవీన్ మట్లాడుతూ గ్రామ యువకులకు , క్రీడాకారులకు క్రీడా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయని, అలాగే వాళ్ళ ఐక్యతను పెంచడంతో పాటు మత్తు మందుకు చెడు అలవాటులకు పోకుండా ఈ ఆటతో వారికి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు.అలాగే ఈ క్రీడల ద్వారా జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో ఆడటానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు , పంచాయితీ పాలకవర్గ సభ్యులు యువకులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular