Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణఖమ్మంటిఆర్ఎస్ పార్టీలోకి యువ నాయకుడు ప్రేమ్ కుమార్ చేరిక

టిఆర్ఎస్ పార్టీలోకి యువ నాయకుడు ప్రేమ్ కుమార్ చేరిక

📰 Generate e-Paper Clip

పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవరపు జగదీష్

నవగీతం,వైరా ప్రతినిధి:

వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన యువ నాయకుడు పూర్ణ కంటి ప్రేమ్ కుమార్ బుధవారం తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ జండా పండగ సందర్భంగా బుధవారం ఆ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవరపు జగదీష్ నాయకత్వంలో చేరారు. ప్రేమ్ కుమార్ గత మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు నుండి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వలప తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే, ఆయన టిఆర్ఎస్ లో చేరడంతో ఇందిరమ్మ కాలనీ నుండి పెద్ద ఎత్తున యువకులు పార్టీలోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. టిఆర్ఎస్ జండా పండగ సందర్భంగా ఇన్చార్జి జగదీష్ సుడిగాలి పర్యటన చేస్తున్నడంతో వైరా మండలంలో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి ముందుకొస్తున్నారు. కొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా చేరటానికి సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ, ఈనెల 20 నుండి జూన్ 20 వరకు నెల రోజులపాటు జరిగే తెలంగాణ రాష్ట్ర సేన జెండా పండుగ కార్యక్రమాలు పూర్తయ్యేసరికి వైరా నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ చేరికలతో నిండిపోతుందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular