నవగీతం,వైరా ప్రతినిధి:
వైరా రింగ్ రోడ్డు వద్ద గ్రామ దీపికలు సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకి చేరుకుంది . గ్రామ దీపికల వేతనాల పెంపుదల తో పాటు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని దీక్షణ చేపట్టడం జరిగింది. గ్రామ దీపకులకు వేతనం పెంచి ప్రభుత్వం వారిని ఉద్యోగులుగా గుర్తించాలని ప్రతి గ్రామంలో గ్రామ దీపికాలు మహిళా సమైక్యాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలను సైతం ప్రజలకు వివరిస్తున్నారని, గ్రామ దీపికల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని వేతనం పెంచాలని అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో గ్రామ దీపికలు పూర్తిస్థాయిలో ఆ పథకాల అమలను ప్రజలకు వివరించడంలో ముందున్నారని విషయాన్ని వారు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గద్దె నీరజ, పద్మావతి, శైలజ ,నిర్మల ,మమత, తేజ, ప్రభావతి ,రమాదేవి, రాధా, మణి, మల్లేశ్వరి ,విజయలక్ష్మి ,స్రవంతి తదితరులు పాల్గొన్నారు

