Tuesday, August 4, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలరమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వార్డు సభ్యులు

రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వార్డు సభ్యులు

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గొట్టిపడుత రమేష్ గౌడ్ తండ్రి మల్లయ్య గౌడ్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం బాధిత కుటుంబ సభ్యులను మల్లాపూర్ గ్రామ పంచాయతీ నాలుగవ వార్డు సభ్యులు ముత్యాల గంగారాజం  పరామర్శించారు. రమేష్ గౌడ్ నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన వెంట సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular