Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలగౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

📰 Generate e-Paper Clip

నవగీతం,రాయికల్ ప్రతినిధి:

రాయికల్ పట్టణంలో మంగళవారం ఎల్లమ్మ పట్నాల సందర్భంగా బోనాల పండుగను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఇంటికో బోనంతో మహిళలు తరలి వచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.అనంతరం ఓడి బియ్యం పోసి మొక్కలు చెల్లించారు.పోతూ రాజులు, బైండ్ల పూజారుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు ఏనుగందుల శ్రీనివాస్ గౌడ్,కోశాధికారి బండి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు పొన్నం శ్రీకాంత్,కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular