Thursday, June 18, 2026
ads
Homeకరీంనగర్జనసేన సభను విజయవంతం చేయండి :జనసేన నేత కాస రాజు పిలుపు

జనసేన సభను విజయవంతం చేయండి :జనసేన నేత కాస రాజు పిలుపు

📰 Generate e-Paper Clip

నవగీతం,కరీంనగర్ ప్రతినిధి:

జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన హైదరాబాద్ లో జరగనున్న తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ నీ విజయవంతం చేయవలసిందిగా జనసేన పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు కరీంనగర్ జనసేన పార్టీ నాయకులు కాసరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాస రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన సాధక్ సమ్మేళనం కార్యక్రమాన్ని జూన్ రెండవ తేదీన హైదరాబాదులో నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులకి దిశా నిర్దేశం చేసి పార్టీని మరింత బలోపేతం చేసి తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని పటిష్టంగా చేయడానికి సూచనలు చేయనున్నట్లు తెలిపారు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఎండగడుతూ ప్రజలకి అండదండలుగా నిలవాలని వీటిపై నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular