నవగీతం, హైదరాబాద్:
ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఎవరితోనైనా మాట్లాడాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్‌ను షేర్ చేయాల్సి వచ్చేది. ఇకపై ఆ సమస్యకు చెక్ పడనుంది.ఫోన్ నంబర్ కాకుండా యూజర్ నేమ్ (Username )ద్వారానే ఇతరులతో చాట్ చేసే అవకాశం వాట్సాప్ కల్పించనుంది.ఈ విషయాన్ని సీఈవో కునాల్ షా అధికారికంగా ప్రకటించారు.అంతేకాదు.. “మీకు నచ్చిన పేరును ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి” అంటూ వినియోగదారులకు సూచించారు.ఈ ఫీచర్‌ను జూన్ 29 నుంచి దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తుండగా.. ఈ ఏడాది చివరినాటికి అందరికీ అందుబాటులోకి రానుంది.

