Monday, August 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలయూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన ఉద్యోగులను నియమించాలి

యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన ఉద్యోగులను నియమించాలి

📰 Generate e-Paper Clip

సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో మేనేజర్‌కు వినతిపత్రం

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని యూనియన్ బ్యాంకులో హిందీ భాష మాత్రమే తెలిసిన ఉద్యోగులు విధులు నిర్వహించడం వల్ల మల్లాపూర్ మండలం మరియు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భాషా సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు.ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సోమవారం యూనియన్ బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్థానిక ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగు భాషలో మాట్లాడగలిగే ఉద్యోగులను తక్షణమే నియమించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగు తెలియకపోవడం వల్ల బ్యాంకు లావాదేవీలు నిర్వహించడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వృద్ధులు, రైతులు,నిరక్షరాస్యులు మరింత ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏనుగు లక్ష్మి, అల్లె లత, కదుర్క లక్ష్మి, మహమ్మద్ షబ్బీర్,  ముష్కరి రమేష్, మొరపు లక్ష్మి, ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular