Thursday, September 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలశివసేన యూత్ సభ్యులకు టీషర్ట్లు పంపిణీ 

శివసేన యూత్ సభ్యులకు టీషర్ట్లు పంపిణీ 

📰 Generate e-Paper Clip

 శాలువాతో సన్మానించిన యూత్ సభ్యులు

మల్లాపూర్, సెప్టెంబర్ 13 (నవగీతం): మల్లాపూర్ మండల కేంద్రంలోని 11వ వార్డులో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వార్డు సభ్యులు మహమ్మద్ షబ్బీర్ శివసేన యూత్ సభ్యులకు టీషర్ట్లను పంపిణీ చేశారు. మతాలకు అతీతంగా టీషర్ట్లను పంపిణీ చేసి సోదరభావాన్ని చాటిన మహమ్మద్ షబ్బీర్‌ను ఈ సందర్భంగా వార్డు ప్రజలు అభినందించారు. పండుగల సందర్భంగా అందరూ ఐకమత్యంతో, స్నేహభావంతో ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శివసేన యూత్ అధ్యక్షులు పెంద్రం రాజేష్,మాజీ అధ్యక్షులు ఎల్ల నవీన్,ఉపాధ్యక్షుడు పల్లికొండ వినోద్, నెల్లి సుధాకర్, ఎగుర్ల మహేష్, కోటగిరి హరిచరణ్, ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular