Tuesday, November 3, 2026
ads
Homeతెలంగాణకరీంనగర్నిరుపయోగంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు కేటాయించాలి

నిరుపయోగంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు కేటాయించాలి

📰 Generate e-Paper Clip

కరీంనగర్, అక్టోబర్5,(నవగీతం)

కరీంనగర్ జిల్లాలోని బద్దిపల్లి, వెలిచాల గ్రామాల్లో నిర్మించిన సుమారు 2,500 ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని కోరుతూ జనసేన పార్టీ వీర మహిళ నాయకురాళ్లు రాగుల శిరీష, గుండ శకుంతల, కందకట్ల స్వరూప జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద బద్దిపల్లి, వెలిచాల గ్రామాల్లో సుమారు 2,500 ఇళ్లను నిర్మించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ ఇళ్లలో ఎవరూ నివసించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయని పేర్కొన్నారు. నిర్మించిన ఇళ్లు ఖాళీగా ఉండటం వల్ల ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయని, వాటిని అర్హులైన నిరుపేద కుటుంబాలకు కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

ప్రత్యేకంగా వితంతువులు, ఒంటరి మహిళలు, ఇల్లు లేని నిరుపేదలకు ఈ ఇళ్లను కేటాయిస్తే వారికి ప్రభుత్వం అండగా నిలిచినట్టవుతుందని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular