నూతన వస్త్రాలు పంపిణీ చేసిన
మార్గం నరేష్
నవగీతం, మల్లాపూర్
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామపంచాయతీ సపాయి కార్మికులకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రముఖ సంఘ సేవకులు మార్గం నరేష్ కుమార్ నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు వారి కృషి వల్లే గ్రామము పరిశుభ్రంగా ఉంటుందని వారి సేవలు ఎంతో అమోఘమని వారిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దప్పుల పద్మ నరసయ్య,ఏఎంసీ చైర్మన్ పుష్పలత నర్సయ్య, అంతడుపుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

