Saturday, March 7, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలపసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి

మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ లో వసంత పంచమి పురస్కరించుకొని పుల్లూరి రాములు అడ్తి దుకాణంలో పసుపు కొనుగోలును మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ శుక్రవారం వసంత పంచమిని పురస్కరించుకొని పసుపు కొనుగోలు ప్రారంభించడం జరిగిందని దీనిని రైతులు మార్కెట్ యార్డ్ కు ఎండిన పసుపు తీసుకువచ్చి లబ్ధి పొందాలని శుక్రవారం పసుపు కాడి గరిష్టదర రూ.14.511, గోల గరిష్ట ధర రూ. 13,911. మరియు చూర గరిష్ట ధర రూ.12666 కొనుగోలు జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ కమిటీ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, పాలక వర్గ సభ్యులు సంగు గంగాధర్, పుప్పాల గంగాధర్, పల్లి శేఖర్ గౌడ్, వ్యాపారులు పుల్లూరి రాములు, మహాజాన్ నర్సింలు పుల్లూరి నవీన్, పుల్లూరి సతీష్ ఎలిమి శంకరయ్య గుంటుక రవి మైలారం రాంబాబు, సుతారి చిన్న అంజయ్య శివకుమార్ పడిగేల హరీష్, రైతులు రవి శ్రీను రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular